Welcome to Krishna Basara
శ్రీ కృష్ణ, సరస్వతి దేవిల ఆలయలములు N. గొల్లపాలెం గ్రామం, అంధ్ర ప్రదేశ్. :- N. గొల్లపాలెం గ్రామం, పవిత్ర కృష్ణా నదీ తీరాన, పుణ్య క్షేత్రాల మధ్య, కృష్ణమ్మ పరవళ్ళతో సస్యశ్యామలమై నేత్రానందంగా ఉండే ప్రకృతి అందాల నడుమ ఉన్న, చిన్న ఆదర్శ గ్రామం. ఎగువన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో విలసిల్లే మోపిదేవి పుణ్య క్షేత్రం, దిగువన, కృష్ణమ్మ ఆనంద పారవశ్యంతో పొంగుతూ,పారుతూ, పరుగు పరుగున అనంతుడైన సముద్రుడిని, ఆనందంగా కలిసి, ఆయనలో పూర్తిగా లీనమై, అద్వైతానంద స్థితిని పొందే ప్రదేశం “హంసలదీవి” పుణ్య క్షేత్రముల మధ్య, పాడి పంటలతో సమృద్ధమై, యెదుకుల భూషణుడు, శ్రీ కృష్ణ బగవానుని, వారసులైన సుహృద్భావ గోపాలురతో నిండి, పండిత పామరులను సమదృష్టితో దర్శించుచు, నిష్కమాచరణ జీవిత భాగమై, గ్రామాభివృద్ధికి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడక, వారినిధులతో, స్వయంకృషితో శ్రమదానంతో, గ్రామానికి కావలసిన వసతులు (శుద్ధమైన త్రాగు నీరు, పొలాలకు మెరుగైన బాటలు మొదలైనవి) ఏర్పాటు చేస్కుంటూ అందరూ ఒక్కటై, కక్షలు కార్పణ్యాలు లేకుండా పరస్పర ప్రేమ గౌరవాలతో నివసిస్తూ భారతీయతను తమ జీవితాలలో ప్రతిబింబిస్తూ భారతావనిలోవిలసిల్లుచున్న కొద్ది గ్రామాలలో ఈ గ్రామం తలమానికం.
ఇది ఆంధ్రుల రాజధాని అమరావతికి షుమారు 80 కిలోమీటర్ల దూరంలో, ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య జన్మస్థలం అయిన కూచిపూడి గ్రామానికి షుమారు 30 కిలోమీటర్లు, మచిలీపట్నం గా ప్రసిద్ధి చెందిన పురాతన పట్నం ఓడరేవుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ పురాతన పట్నం పాండురంగనుని క్షేత్రంగా కూడా,ప్రసిద్ధి.
గ్రామ జనాభా షుమారు 1000 మంది, 500 కుటుంబములు, మునుపటి తరం వరకు అందరూ వ్యయసాయదారులే. ఈ తరం యువకులు మాత్రం చదువుల తల్లి సరస్వతిని ఆశ్రయించి, దేశ విదేశాలలో ఉన్నత పదవులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో 80/90 యువకులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు,సాంకేతిక నిపుణులుగా ఖ్యాతిని ఆర్జించు చున్నారు. అయినా, గ్రామ సంప్రదాయాలకు దూరం కాకుండా, గ్రామంలో వైభవంగా జరిగే, గణపతి నవరాత్రములు,శ్రీ కృష్ణాష్టమి, దసరా మొదలగు ఉత్సవములలో కుటుంబ సమేతంగా పాల్గొంటూ, గ్రామీణ కళలు – కోలాటం, చెక్క భజన, పౌరాణిక నాటకాలు ఇత్యాదిని తర్వాత తరానికి పరిచయం చేస్తూ, సామూహిక భోజనాలలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తూ, గ్రామంతో సంబంధ బాంధవ్యాలు నెరుపుచున్నారు.
శ్రీకృష్ణ, సరస్వతి దేవి ల ఆలయాల నిర్మాణ సంకల్పం :- ఇది ఆంధ్రుల రాజధాని అమరావతికి షుమారు 60 కిలోమీటర్ల దూరంలో, ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య జన్మస్థలం అయిన కూచిపూడి గ్రామానికి షుమారు 30 కిలోమీటర్లు, మచిలీపట్నం గా ప్రసిద్ధి చెందిన పురాతన పట్నం ఓడరేవుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ పురాతన పట్నం పాండురంగనుని క్షేత్రంగా కూడా,ప్రసిద్ధి. గ్రామంలో రామాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నాయి. కృష్ణాలయం, సరస్వతి ఆలయాల నిర్మాణ ఆవశ్యకత ఏమిటి? రాముడు ధర్మాన్ని ఆచరించాడు; కృష్ణుడు ధర్మాన్ని ఆచరించాడు; మానవులకు శాంతి సౌఖ్యాలతో జీవించుటకు జీవన కళను అర్జునుని నిమిత్తంగా, గీత రూపంగా, బోధించాడు. అయన గీతాచార్యుడు.ప్రపంచ వ్యాప్తంగా విశ్వమానవుని చేత ఆమోదింపబడిన ఏకైక ఆధ్యాత్మిక గ్రంధం –భగవద్గీత.
ఆ కృష్ణునికి వారసులమై అతని బోధతో కొంత ప్రభావితులం అయిన మనం, ఆ కృష్ణ భగవానునకు, ఒక భవ్యమైన దేవాలయం (చూడగానే బోధ స్మృతి పధంలో మెదలులాగున), గ్రామానికి ఉపయోగ పడేటట్లుగా (పెళ్ళిళ్ళు, పేరంటములు, ఇతర శుభకార్యములు) నిర్మించాలనే సంకల్పం, ఈ యువకులకు కలిగింది. తత్ఫలితమే శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణ సంకల్పం. “ఆ శ్రీకృష్ణుని, చదువుల తల్లిగా ఆరాధిద్దాం, సరస్వతి రూపంలో”.
భారతీయతలో గల అందమైన అంశం, భిన్నత్వంలో ఏకత్వంకు ఒక ఆకృతిని నిర్మిద్దామనే సంకల్పమే –సరస్వతి దేవి ఆలయానికి పునాది. ఈ ఆలయాలు రెండూ ఒకే మండపాన్ని కలిగి ఉంటాయి. విస్తీర్ణం షుమారు 3000 చదరపు అడుగులు, ఒక ఎకరం పావు విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్నాయి. ఆలయం అర్చకునికి ఒక నివాసం కూడా ఏర్పాటు చేయాలని వీరి సంకల్పం. గ్రామంలోని 350 కుటుంబములు, బయట పని చేయుచున్న యువకులు, అందరూ కలిసి మేధోశక్తిని, దేహశ్రమని, ఆర్ధిక వనరులను, సమకూరుస్తూ, కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు.
షుమారుగా దేవాలయాల నిర్మాణాలకు కావలసిన్ ధనం :-
ఇంతవరకు ఖర్చు పెట్టినది:
ప్రస్తుతం చేతిలో ఉన్న నగదు:
షుమారుగా నిర్మాణం పూర్తవుటకు ఇంకా అవసరమైన్ నగదు:
ఈ ఆలయ ప్రాంగణం శ్రీకృష్ణ ద్వారక – బాసరగా ప్రసిద్ధమవ్వాలని వారి ఆకాంక్ష. వారు అతి శీఘ్రంగా వారి లక్ష్యాన్ని చేరుకోవాలని భగవంతుని ప్రార్ధిద్దాం. ధన రూపంగా గాని, వస్తు రూపంగా గాని, సహాయాన్ని అందించి, ఈ బృహత్ యజ్ఞంలో మనంకూడా ఒక సమిధను సమర్పించి పాల్గొందాం. ఇందు కోసం సంప్రదించవలసిన చిరునామా, వ్యక్తుల వివరములు, సెల్ ఫోన్ నెంబర్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
భారతీయులమై పుట్టాము, భారతీయులుగా జీవిద్దాం.
అన్ని సంపదలలో ఉత్తమమైన సంపద – “త్యాగం” అనే సత్యాన్ని, మరింత, మనం అనుభవంలోకి తెచ్చుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు. |
శ్రీకృష్ణ, సరస్వతి దేవాలయముల నిర్మాణ సమితి. |
N. గొల్లపాలెం గ్రామం, |
తేది: 10-02-2019. |