N.Gollapalem,Pedayadara(post),Machilipatnam(md),Krishna(dist),Andhrapradesh,pincode:521001

Popular Events

శ్రీ కృష్ణాష్టమి

కృష్ణ జన్మాష్టమి : శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

సరస్వతీ పూజ.

అన్ని విద్యలకి అధి దేవత అయిన తల్లి సరస్వతీ మాత, ఆతల్లిని పూజించిన వారికి తద్వారా ఆమె అనుగ్రహం పొందినచో అన్నిరకాల ఆటంకాలు విద్యాపరంగా తొలగిపోతాయి ఇప్పుడు ప్రత్యేకంగా సరస్వతీ పూజ విధానం గురించి చెపప్పుకుందాం. మూలా నక్షత్రం, సప్తమినాడు వచ్చిన రోజున చేయ వలసింది ఈ పూజ. వీలైన వారు గుడిలో, దేవీమంటపాలలో, లేని స్థితులలో ఇంటిలో సరస్వతీ పటం ఉంచి పూజించ వచ్చు.